కామారెడ్డి అర్బన్: సీపీగెట్–2026 (తెలంగాణ కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్)ఫలితాల్లో కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ కే విజయ్‌కుమార్ తెలిపారు. కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కెమిస్ట్రీలో వసంత్ (34వ ర్యాంకు), తరుణి (36వ ర్యాంకు) విష్ణువర్ధన్ (74), హిమవంతిని (120), బాటనీలో తరిణి (36), శ్రీనికేతన్ (84), హిందీలో బి.ఈశ్వర్ (54), ఫిజిక్స్‌లో కే స్రవంతి 79వ ర్యాంకు సాధించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధిపతులు, అధ్యాపకులు జయప్రకాశ్, దినకర్, శ్రీనివాస్‌రావు, రాజశ్రీ, మానస, రాజ్‌గంభీర్‌రావు, శారద, శ్రీనివాస్, శ్రీలత, పవన్, వెన్నెల, రమణ తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: అఖిల భారత విద్యార్థి సమా ఖ్య (ఏఐఎస్‌ఎఫ్) జాతీ య కార్యవర్గ సభ్యుడిగా ఉ మ్మడి నిజామాబాద్ జి ల్లాకు చెందిన బానోత్ రఘురాంనాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంస్థ 90వ వార్షికోత్సవాలను ఈనెల 12, 13 తేదీల్లో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నుకున్న జాతీయ కార్యవర్గంలో రఘురాంకు చోటుదక్కింది. బాన్సువాడ మండలం రాంపూర్‌తండాకు చెందిన రఘురాం ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా రఘురాం జాతీయ, రాష్ట్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి, ప్రభుత్వ విద్యారంగ బలోపేతమే లక్ష్యంగా తన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.


