నాగిరెడ్డిపేట: ఎమ్మార్పీఎస్ మండలస్థాయి నూతన కార్యవర్గాన్ని నాగిరెడ్డిపేట మండలకేంద్రంలో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంథోని సామెల్ ఆధ్వర్యంలో మండల కమిటీని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుడిగా నింగమొల్ల ఊశయ్య, అధికార ప్రతినిధిగా అక్కమొల్ల సురేందర్, ఉపాధ్యక్షులుగా గడ్డమీది సాయిలు, ఎర్ర కుమార్, రాజగల్ల యాదగిరి, ప్రధాన కార్యదర్శులుగా తొంట బాబు, ఎర్రోళ్ల సాయిలు, కోశాధికారిగా బుర్ర సాయిలు, కార్యదర్శులుగా తొంట బాలు, మాసగల్ల ఊశయ్య, గుడ్డివెంకని అశోక్, గుడ్డివాని చంద్రబాబు, సహాయ కార్యదర్శులుగా పసులాది దుర్గయ్య, నాగంపల్లి గోపాల్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, కిష్టాఫర్, సాయిలు, బాబురావు, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం పట్టణ అధ్యక్షుడిగా ముదాం వెంకటేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా రామడిపేట రాజు, కోశాధికారిగా అనుమండ్ల రమేశ్ ఎన్నికయ్యారు. పట్టణ మున్నూరు కాపుల సమాజ అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తానని వెంకటేశ్వర్ పేర్కొన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు, ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రావుల గంగాధర్, ముదాం శ్రీనివాస్, బొజ్జ రవి, స్వామి, వెంకట్‌రాజ్, శంకర్, సాయిలు, నవీన్, రాజేశ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్: జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను బుధవారం ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు విడతల వారీగా బిల్లులు మంజూరు చేస్తామని చెప్పారు. ఆయన వెంట ఎంపీవో రాములు, పంచాయతీ అధికారి తదితరులు ఉన్నారు.
బాన్సువాడ రూరల్: మండలంలోని తాడ్కోల్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను సర్పంచ్ అందె రమేశ్ జీపీ కార్యదర్శి భరత్‌తో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు. నిర్మాణాలు ప్రారంభించని వారు వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు.


