నాగిరెడ్డిపేట: మండలంలోని గోపాల్‌పేట మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ రాంప్రసాద్‌ను బుధవారం విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల అభివృద్ధికి ప్రిన్సిపాల్ చేస్తున్న కృషితోపాటు తీసుకుంటున్న చొరువను గుర్తించి విద్యాశాఖ కమిషనర్ హైదరాబాద్‌లోని తన ఛాంబర్‌లో ఆయనను అభినందించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
భిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం భూముల సర్వే మూడు రోజులుగా కొనసాగుతోంది. దేవాలయానికి సంబంధించిన భూమల విస్తీర్ణం, హద్దులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి నమోదు చేస్తున్నారు. దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఆలయ ఈవో శ్రీధర్‌రావు, సర్వే అధికారి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి సనానత సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు, నృత్యకళాకారుడు మాలోత్ నవీన్‌కు ఉత్తరప్రదేశ్ అయోధ్యకు చెందిన త్రేతాయుగ్ ఫౌండేషన్ ‘ది ఐకానిక్ ఇండియా’ పురస్కారం ప్రకటించింది. స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించే జాతీయస్థాయి కార్యక్రమంలో నవీన్‌కు ది ఐకానిక్ ఇండియా పురస్కారం అంద జేయనున్నట్లు త్రేతాయుగ్ ఫౌండేషన్ పేర్కొంది.


