ఎల్లారెడ్డి: ఓటర్ డ్రాఫ్ట్ జాబితాను ఈనెల 17న విడుదల చేయనున్నట్లు ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆర్డీవో కార్యాలయంలో అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో మొత్తం 2,28,503 ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, వాటిని బీఎల్‌వో యాప్ ద్వారా వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. వీటిలో 22,469 ఫారాలు మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, డబుల్ ఓటర్లుగా గుర్తించామని తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఆర్డీవో కార్యాలయంలో తీసుకోవడం జరుగుతుందన్నారు. తుది ఓటరు జాబితా అక్టోబర్ 10న విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రేమ్ కుమార్, గిర్దావర్ భరత్, ఎన్నికల సిబ్బంది, నాయకులు అజహర్, బాలకిషన్, నర్సింలు, దేవేందర్ పాల్గొన్నారు.
పాఠశాల తనిఖీ
ఎల్లారెడ్డి: గిరిజన బాలికల గురుకుల పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఆర్డీవో ప్రభాకర్ ప్రిన్సిపాల్‌కు సూచించారు. ఆర్డీవో పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆర్డీవో పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, ప్రిన్సిపాల్ ప్రమీల, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.


