సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలో వివిధ రకాల దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తిని పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. వజ్జపల్లి తండాలోని జగదాంబ ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసును చేధించి, పూర్యానాయక్ తండాకు చెందిన మాలోత్ నవీన్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద బంగారు ఆభరణాలు, నగదును, దొంగతనానికి ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. రెండు బంగారు ఉంగరాలను గాంధారిలోని గోల్డ్ షాప్‌లో విక్రయించి రూ.40,600 పొందినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. మిగిలిన బంగారు ఆభరణాలను పోలీసులకు దొరకకుండా తన ఇంటిలో దాచిపెట్టినట్లు నిర్ధారించారు. ఎస్సై పుష్పరాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


