భిక్కనూరు: భిక్కనూరు సిద్దరామేశ్వరాలయం హుండీని బుధవారం లెక్కించారు. ఐదు నెలలకు సంబంధించిన హుండీని లెక్కించగా.. రూ. 5,41,830 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో శ్రీధర్‌రావు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయశాఖ పరిశీలకులు సత్యనారాయణ, ఆలయ అనువంశిక అర్చకులు రామగిరిశర్మ, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి, కామారెడ్డి సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.
నిజాంసాగర్: సూపర్ ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని జెడ్పీ సీఈవో చందర్‌నాయర్ నాయక్ సూచించారు. బుధవారం నిజాంసాగర్‌లో నిజాంసాగర్, మహ్మద్‌నగర్ మండలాల మండల పరిషత్, ఈజీఎస్, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలసిరిని ఒడిసి పట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాలలో ఫాంపాండ్స్, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. సమావేశంలో ఎంపీడీవోలు శివకృష్ణ, అనిత తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: జ్యోతీబా ఫూలే సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నీట్, జేఈఈలకు ఉచితంగా లాంగ్ టర్మ్ శిక్షణ అందిస్తున్నారు. ఈ విషయాన్ని బీసీ గురుకులాల ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త రాధిక తెలిపారు. బాలికలకు నాగోల్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో, బాలురకు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సెంటర్ ఆప్ ఎక్సలెన్స్ కళాశాలలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. నీట్ యూజీ, జేఈఈ 2027 ప్రవేశపరీక్షకు హాజరయ్యే బీసీ విద్యార్థులు ఈనెల 16లోగా https://mjptbcadmissions.org వెబ్‌సైట్ ద్వా రా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నాగిరెడ్డిపేట: రైతులు ఆయిల్‌పాం సాగు చేప ట్టి లాభాలు పొందాలని జిల్లా ఉద్యానశాఖ అ ధికారి(డీహెచ్‌వో) జ్యోతి సూచించారు. మా ల్తుమ్మెద ఉద్యానక్షేత్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. పరిసరాలను పరిశీలించి దిన సరి కూలీలకు పలు సూచనలు ఇచ్చారు. అ నంతరం ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్‌లో ఏర్పాటు చేస్తున్న ఆయిల్‌పాం నర్సరీని పరిశీలించారు. ఆమె వెంట ఎల్లారెడ్డి హెచ్‌వో సుమన్, హెచ్యూఎల్ మేనేజర్ శ్రీనివాస్‌గౌడ్, ఏరియా మేనేజర్ ప్రశాంత్ తదితరులున్నారు.
భిక్కనూరు: ఇటలీలో జూలై 30 నుంచి ఆగస్టు 7 వరకు జరిగిన సెయిలింగ్ ఇంటర్నేషనల్ కాడెట్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ చూపిన భిక్కనూరు విద్యార్థిని రిశ్వితను రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లో తనను కలిసిన రిశ్వితను ఆయన సన్మానించారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఎల్లారెడ్డి: పట్టణంలోని వీక్లీ మార్కెట్‌లో నివాసముండే హోంగార్డు అర్జున్ భార్య ప్రమీల (40) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కుమారులు చదువులో వెనకబడి ఉండడంతో ఆమె మనస్తాపం చెంది, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


