లెఫ్టీ.. ప్రతిభలో మేటి | - | Sakshi
Sakshi News home page

లెఫ్టీ.. ప్రతిభలో మేటి

Aug 13 2026 1:15 AM | Updated on Aug 13 2026 1:15 AM

చిన్నప్పటి నుంచీ..

విభిన్నతే వారి ప్రత్యేకత

ఎడమ చేతివాటం అరుదైన వరం

నేడు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జనాభాలో కేవలం పది శాతం మంది మాత్రమే ఎ డమ చేతివాటం కలి గి ఉంటారు. అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, అబ్దుల్‌ కలాం వంటి మహానుభావులు విభిన్న ఆలోచనలతో ప్రపంచంలో గుర్తింపు పొందారు. ఎడమ చేతివాటం అనేది ఎటువంటి లోపం కాదని, అది ప్రకృతి ఇచ్చిన ఒక అరుదైన వరమని పేర్కొంటారు. విభిన్నంగా ఆలోచించే తత్వమే వారిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. మన దగ్గర ఎంతో మంది ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా ఎడమ చేతివాటంతో గుర్తింపు పొందిన వారున్నారు. వ్యా పార రంగంలోనూ ఎడమచేతి వాటం వారు ముందున్నారు. స్నేహితులు, కుటుంబసభ్యులు ఆటపట్టించినా ఎక్కడా తగ్గకుండా కుడి చేతివాటం వారికన్నా అన్నింటా ముందుంటారు.

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌ అన్నారో సినీ కవి. ఎడమ చేతివాటమని కొందరు ఆటపట్టిస్తుంటారు. కానీ ఎడమ చేతివాటం ఉన్నవాళ్లు ప్రతిభావంతులుగా, సృజనశీలురుగా, తాము ఎంచుకున్న రంగంలో ముందుంటారని చెబుతారు. గురువారం లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

ఓనమాల నుంచి ఎడమ చేతితోనే రాసేవాడిని. ఎడమ చేతితో నే అన్ని పనులు చేస్తాను. అందరిలాగే చేసినట్టు అనిపిస్తుంది. చూసేవారికే ప్రత్యేకంగా కనబడుతోంది. – ప్రకాశ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌,

మండల పరిషత్‌, నాగిరెడ్డిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement