కామారెడ్డి టౌన్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ కేవ లం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఐఐఈసీ ప్రచార కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో వెంకట్‌తో కలిసి ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. జీజీహెచ్ ఆర్‌ఎంవో రవీందర్ గౌడ్, హెచ్‌ఐవీ నివారణ జిల్లా అధికారి ప్రదీప్ కు మార్, ఏఆర్‌టీ వైద్యులు స్నేహ, ఆంచల్, వైఆర్‌జీ కేర్ ఉమ్మడి జి ల్లా డీఆర్‌పీ గర్దాస్ సుధాకర్, కౌన్సిలర్లు మేక నాగ రాజు, శేఖర్, పాముల లలిత కుమారి, మెహరాజ్, చిరంజీవి, ప్రవీణ్ గౌడ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


