గుంతలతో వాహనదారులకు చింత | - | Sakshi
Sakshi News home page

గుంతలతో వాహనదారులకు చింత

Aug 12 2026 1:28 AM | Updated on Aug 12 2026 1:28 AM

బీబీపేట – ఇస్సానగర్‌ వెళ్లే రోడ్డులో ఏర్పడిన గుంతలు

బీబీపేట: మండలంలోని ఆయా గ్రామాలకు వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసమై అడుగుకో గుంతలమయంగా మారింది.గుంతల్లో నీళ్లు నిలువడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

మెదక్‌, హైదరాబాద్‌ వెళ్లేందుకు ప్రధాన రోడ్డు..

బీబీపేట మండలంలోని 11 గ్రామాల ప్రజలు ఉప్పర్‌పల్లి, ఇస్సానగర్‌ మీదుగా రామాయంపేట నుంచి హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాలకు వెళ్తుంటారు. బీబీపేట, ఇస్సానగర్‌ మధ్యలో పెద్ద చెరువు కట్ట కింద రోడ్డుకు భారీ గుంతలు ఏర్పడ్డాయి. మూలమలుపుల వద్ద గుంతలు ఏర్పడడంతో వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారిపై కూడా వంతెన వద్ద భారీ గుంతలు ఏర్పడ్డాయి. అలాగే జనగామ గ్రామంలోని మూలమలుపు వద్ద సైతం గుంతలు ఏర్పడడంతో ఇప్పటికే చాలాసార్లు గ్రామస్తులు పూడ్చారు. అయినప్పటికీ అవి అలాగే ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు గుంతలు పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement