కామారెడ్డి అర్బన్: సనాతన ధర్మంలో మహిళలను మాతృమూర్తిగా పూజించి గౌరవించే సంప్ర దాయం ఉందని, అది నేటి కలియుగంలోనూ కొనసాగాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత మాతృ శక్తి సంయోజక పద్మశ్రీ, సహ సంయోజక వాణిశ్రీ అన్నారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో మంగవారం కామారెడ్డి అయ్యప్ప ఫంక్షన్‌హాల్‌లో మహిళా పరిచయ వర్గ కార్యక్రమం నిర్వహించగా వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం అధ్యక్షత వహించారు. ఇంటిని కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసే మహిళా శక్తి గూర్చి వివరించారు. జిల్లాలో విస్తృతంగా మహిళా పరిచయ వర్గలు, సత్సంగాలు నిర్వహించాలని పద్మశ్రీ, వాణిశ్రీ సూచించారు. వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి గంగాధర్, గంగారెడ్డి, పాపారావు, మాతృశక్తి దుర్గా వాహిని ప్రతినిధులు పాల్గొన్నారు.


