రామాయంపేట(మెదక్) : రామాయంపేట వద్ద జాతీయ రహదారిపై వై జంక్షన్‌వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్‌కు చెందిన జూపల్లి వెంకట్రావు(49) హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. రాత్రి స్కూటీపై తన స్వగ్రామానికి వస్తున్న క్రమంలో జంక్షన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు రిషి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి..
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ మామిడిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. ఈనెల 10న కరీంనగర్–నిజామాబాద్ ప్యాసింజర్ రైలు ఓ వ్యక్తిని ఢీకొనడంతో చికిత్స కోసం అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతను మంగళవారం మృతిచెందినట్లు పేర్కొన్నారు. అతని నుదిటిపై జై హో భీమా అనే టాటూ ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన 8712658591 నంబర్‌ను సంప్రదించాలన్నారు.


