ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

Aug 11 2026 12:54 AM | Updated on Aug 11 2026 12:54 AM

ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి టౌన్‌ : స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ’హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం వేలాది మంది త్యాగధనుల ఫలితమని, వారి పోరాట పటిమను నేటి తరానికి గుర్తు చేయడానికే ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

భిక్కనూరు: మెదక్‌ జిల్లా పరిధిలోకి వెళ్లిన మండలంలోని భాగిర్తిపల్లి గ్రామంలోని 40 ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డిని గ్రామ బీజేపీ నేతలు కోరారు. గ్రామంలో 40 ఇళ్ల వారు ఇబ్బందులు పడుతున్నారని సమస్య పరిష్కరించాలని ఆయన్ను కోరారు. వార్డు సభ్యుడు నాయకులు బక్క కుమారస్వామి, గంగయ్య యాదగిరిలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement