నిజాంసాగర్/బాన్సువాడ రూరల్ : మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్, తుంకిపల్లి, గాలీపూర్ గ్రామాల్లో ఆదివారం ఆదివాసి నాయక్‌పోడ్ దినోత్సవాన్ని నాయక్‌పోడులు ఘనంగా జరుపుకున్నారు. కొమరంభీమ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నాయక్‌పోడ్ జెండాను ఆవిష్కరించారు. బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో నాయక్‌పోడ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని కొమురం భీం విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయా గ్రామాల సర్పంచులు గజ్జల జీవన్, కుమ్మరిరాములు, కిరణ్, లావణ్య వెంకాగౌడ్, ఆదివాసినాయక్‌పోడ్ జిల్లా అధ్యక్షుడు మొట్ట పెంటయ్య కాంగ్రెస్ నాయకులు దుబ్బసాయాగౌడ్, భాస్కర్‌రెడ్డి, ఆదివాసి నాయక్‌పోడ్‌లు ఉన్నారు.


