రోస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రోస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలి

Aug 10 2026 1:34 AM | Updated on Aug 10 2026 1:34 AM

రోస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలి

కామారెడ్డి టౌన్‌ : మాలలకు ఉద్యోగ నియామకాలలో తీవ్ర అన్యాయం చేస్తున్న రోస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలని మాలల కోఆర్డినేషన్‌ ఫోరం(ఎంసీఎఫ్‌) రాష్ట్ర నాయకుడు పి. శంకర్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో ఎంసీఎఫ్‌ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోస్టర్‌ విధానంతో ఉద్యోగ నియామకాలలో మాల సామాజిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామగ్రామాన ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఫోరం రాష్ట్ర నాయకురాలు బండ శకుంతల మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ తదుపరి అమలు చేస్తున్న విధానాలను మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర నాయకుడు తిరుపతయ్య మాట్లాడుతూ.. మాలలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వ్యాపార రంగంలోకీ అడుగుపెట్టాలని సూచించారు.

ఎంసీఎఫ్‌ జిల్లా కన్వీనర్‌గా ధర్మపురి

సమావేశంలో ఎంసీఎఫ్‌ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్‌గా ధర్మపురి ఎన్నికయ్యారు. సభ్యులుగా బుల్లెట్‌, రమేష్‌, స్వామి, సుధాకర్‌, జగన్‌ , నరసింహులు, రాజలింగం, దాసరి రాజులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బాబు, నరేందర్‌, రవితేజ, రాము, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement