● 16 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.90 వేలు అపహరణ
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి విద్యుత్‌నగర్ కాలనీలో శనివారం భారీ చోరీ ఘటన వెలుగు చూసింది. గాంధారికి చెందిన పబ్బ సురేశ్ విద్యుత్ శాఖలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా, అతని భార్య లావణ్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ కామారెడ్డిలో నివాసం ఉంటున్నారు. శాఖాపరమైన శిక్షణకు హాజరయ్యేందుకు సురేశ్ మూడు రోజుల క్రితం వరంగల్ వెళ్లా డు. దీంతో అతని భార్యాపిల్లలు సమీప బంధువుల ఇంట్లో ఉన్నారు. శనివారం ఇంటికి వచ్చి చూసేసరికి దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో దాచిన 16 తులాల బంగారం, 30 తులా ల వెండి, రూ.90 వేలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టా రు. సీసీఎస్, క్లూస్‌టీం బృందాలు ఆధారా లు సేకరించారు.
కాలభైరవుడి సేవలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
రామారెడ్డి (ఎల్లారెడ్డి) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి శనివారం రామారెడ్డి కాలభైరవుడిని దర్శించుకున్నారు. కామారెడ్డి నుంచి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆలయానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ వెంట పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, లింగపురం బాల్‌రాజ్, బాలకిషన్, శ్రీనివాస్, సతీశ్ తదితరులు ఉన్నారు.
200 సెల్‌ఫోన్‌ల రికవరీ
● ఎస్పీ రాజేశ్‌చంద్ర
కామారెడ్డి క్రైం: జిల్లాలో 20 రోజులుగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 200 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.32 లక్షలు ఉంటుందన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మ్తొతం రూ.1.59 కోట్ల విలువైన 994 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఫోన్‌ల రికవరీలో ప్రతి భ కనబరిచిన బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు.
మళ్లీ దంచికొట్టిన వాన
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కామారెడ్డి పట్టణంలో 77.8 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. సదాశివనగర్‌లో 68.5 మి.మీ.లు, ఎల్పు గొండలో 50 మి. మీ.లు, గాంధారిలో 46.5, బీబీపేటలో 46.3, దోమకొండలో 41.3 తాడ్వాయిలో 38.5, లచ్చాపేటలో 36.8, హసన్‌పల్లిలో 35.5, ఇసాయిపేటలో 34.8, పిట్లంలో 33.8, బొమ్మన్‌దేవ్‌పల్లిలో 32.8, సర్వాపూర్ లో 30.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.


