పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలి

Aug 8 2026 1:29 AM | Updated on Aug 8 2026 1:29 AM

ఎల్లారెడ్డిరూరల్‌/బాన్సువాడ రూరల్‌/కామారెడ్డి అర్బన్‌: ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆరు పెండింగ్‌ డీఏలను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు అనిల్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మత్తమాల జెడ్పీ పాఠశాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులతో కలిసి నిరసన తెలిపారు. బోర్లం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీ యూనియన్‌ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్‌ ఉపాధ్యాయులతో కలిసి నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.డీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ఎన్సీ ప్రభాకర్‌, ప్రతినిధులు కిషోర్‌కుమార్‌, దానయ్య, వంశీధర్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement