ప్రభుత్వ హాస్టళ్లను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ హాస్టళ్లను వినియోగించుకోవాలి

Aug 8 2026 1:29 AM | Updated on Aug 8 2026 1:29 AM

ప్రభుత్వ హాస్టళ్లను వినియోగించుకోవాలి ప్రపంచ సెయిలింగ్‌ పోటీల్లో ప్రతిభ ఫర్టిలైజర్‌ సేల్స్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి ఆయిల్‌పామ్‌ సాగు లాభదాయకం యోగా పోటీలకు ఎంపిక

భిక్కనూరు: విద్యార్థులు ప్రభుత్వ హాస్టళ్లను వినియోగించుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి నరసయ్య అన్నారు. శుక్రవారం ఆయన భిక్కనూరు ప్రభుత్వ హాస్టల్‌లో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ప్రతి విద్యార్థికి హా స్టల్‌లో పౌష్టికాహరంతో పాటు దుప్పట్లు పుస్తకాలు స్టేషనరిని అందజేస్తామన్నారు. కార్యక్రమంలో హస్టల్‌వార్డెన్‌ పవన్‌కుమార్‌, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భిక్కనూరు: అంతర్జాతీయ క్యాడెట్‌ క్లాస్‌ ప్రపంచ సెయిలింగ్‌ 2026 చాంపియన్‌ షిప్‌ పోటిల్లో భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన బాలిక రిశ్విత రజత పతకాన్ని శుక్రవారం సాధించింది. 31 జూలై నుంచి ఆగస్టు ఏడు వరకు ఇటలీలోని ట్రేంటో ప్రావిన్స్‌లోని టోర్పోలే సుల్‌గార్ద ప్రాంతంలోని గార్దా సరస్సుపై నిర్వహించిన ప్రపంచ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌లో రిశ్విత అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించింది.రిశ్వితను పలువురు అభినందించారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫర్టిలైజర్‌ సేల్స్‌ యాప్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏడీఏ సుధామాధురి సూచించారు. శుక్రవారం మండలంలోని కుప్రియాల్‌ గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. డీఏపీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు అన్ని ఒకే యాప్‌లో బుక్‌ చేసుకోవడానికి వీలు కల్పించినట్లు తెలిపారు.సర్పంచ్‌ రాజమణి, ఉప సర్పంచ్‌ అన్వేష్‌ గౌడ్‌, ఏఈవో కల్యాణి, రాజశేఖర్‌, రైతులు పాల్గొన్నారు.

బాన్సువాడ రూరల్‌: ఆయిల్‌పామ్‌ సాగుకు ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ అని కోనాపూర్‌ క్లస్టర్‌ ఏఈవో జ్ఞానేశ్వర్‌ అన్నారు. శుక్రవారం ఆయన క్షేత్రపర్యటనలో భాగంగా సంగోజీపేట్‌ గ్రామ రైతులకు అవగాహన కల్పించారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ వాటికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. వరిపంటలో మోగి పురుగు నివారణకు మోనోక్రోటోపోస్‌ లేదంటే క్లోరో ఫైరీపాస్‌ మందు పిచికారి చేయాలన్నారు.సర్పంచ్‌ మంద సంగమేశ్వర్‌, గ్రామస్తులు ఆకుల చిన్న నారాయణ, జక్క సాయిరాం, ఆరె సాయిరాం, బాలరాజు, గణపతి పాల్గొన్నారు.

దోమకొండ: రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు దోమకొండ మండల కేంద్రానికి చెందిన ముత్యంగౌడ్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు కామారెడ్డిలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో సీనియర్‌ విభాగంలో ఆయన మూడవ స్థానంలో నిలిచినట్లు జిల్లా యోగా అసోసియేషన్‌ అధ్యక్షుడు రాంరెడ్డి తెలిపారు. దోమకొండ యోగా అసోసియేషన్‌ సభ్యులు ముత్యంగౌడ్‌ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement