పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ | - | Sakshi
Sakshi News home page

పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ

Aug 8 2026 1:29 AM | Updated on Aug 8 2026 1:29 AM

కామారెడ్డి టౌన్‌ : పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్‌ వ్యాధుల నివారణ సాధ్యమవుతుందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి తెలిపారు. జిల్లా కేంద్రంలోని 32వ వార్డులో శుక్రవారం నిర్వహించిన ’ఫ్రై డే–డ్రైడే’ కార్యక్రమంలో ఆమె పాల్గొని వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ పర్వతాలు, కౌన్సిలర్‌ గ్యార అఖిల, ఏఈ వేణు ప్రసాద్‌, ఆర్‌వో గోపాల్‌ రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌, నాయకులు సత్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇంటిలో నీటిని నిలువ ఉంచరాదు

ఎల్లారెడ్డి: ఇంటి పరిసరాలలో, ఇంటిలో నీటిని నిలువ ఉంచరాదని మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ భాగ్యవతి అన్నారు. శుక్రవారం 7వ వార్డులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. కాలనీలోని పలువురికి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు.ఇంటి పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

ఎల్లారెడ్డిలో ఫాగింగ్‌

ఎల్లారెడ్డి: పట్టణంలో దోమలు వృద్ధి చెందకుండా అన్ని కాలనీలలో మున్సిపల్‌ సిబ్బంది శుక్రవారం రాత్రి ఫాగింగ్‌ చేశారు. దోమల నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ పద్మ శ్రీకాంత్‌ తెలిపారు.

విదేశీ కలుపు మొక్కల నిర్మూలన

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు ధర్మారావ్‌పేట్‌, కుప్రియాల్‌ గ్రామాల్లో శుక్రవారం ఈకో ఫాన్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సే వా సంస్థ సహకారంతో విదేశీ ఆక్రమణ కలుపు మొ క్కల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన కల్పించారు. గ్రామ పరిసరాల్లో పెరిగిన విదేశీ ఆక్రమణ కలుపు మొక్కలను గ్రామస్తులు పారా లీగల్‌ వలంటీర్లు, ఈకో ఫాన్‌ సొసైటీ సభ్యులు తొలగించారు. ఈ కార్యక్రమంలో ఈకో పాన్‌ సొసైటీ ప్రతినిధులు మెట్టు సాయి సంపత్‌, తలారి విక్రమ్‌, జిల్లా న్యాయ సేవా సంస్థ పారా లీగల్‌ వాలంటీర్లు అబ్దుల్‌ లతీప్‌, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement