బాన్సువాడ రూరల్: మండలంలోని శ్రీరాం నారా యణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శుక్రవా రం ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ‘నషాముక్త్ భారత్’ నిర్వహించారు. కళాశాల యాంటీ డ్రగ్ కమిటీ భాగస్వామ్యంతో జరిగిన ఈకార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు మాట్లాడు తూ విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని, బంగారు భవిష్యత్‌ను రూపొందించుకోవాలన్నారు. అనంతరం ప్రిన్సిపల్ డా. గంగాధర్ విద్యార్థులతో నషాముక్త్ ప్రతిజ్ఞ చేయించారు.యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయకర్త భగవాన్‌రెడ్డి, ఐక్యూ ఏసీ వినయ్‌కుమార్, అటానమీ కోఆర్డినేటర్ విఠల్, కృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి
డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఉద్యోగంలో రాణించాలంటే ఆత్మవిశ్వాసం, వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలని డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ డా. గంగాధర్ అన్నారు. శుక్రవారం లాంచ్ గర్ల్స్ అనే ఎన్‌జీవో సహకారంతో కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ దివ్య విద్యార్థినులకు లాంచ్ గర్ల్స్ కార్యక్రమ దశలను వివరించారు. విమెన్ ఎంపర్‌మెంట్ సమన్వయకర్త రఫియా యాస్మీన్, ఐక్యు అకాడమిక్ కోఆర్డినేటర్ వినయ్‌కుమార్, ఎన్‌సీసీసీటీవో కృష్ణ, అధ్యాపకులు రేఖ, పద్మ, అనిత, విజయ, నిశాత్‌భాను, ఆఫ్రీన్, విద్యార్థులు పాల్గొన్నారు.


