పోలీస్‌ సేవల్లో పారదర్శకత ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ సేవల్లో పారదర్శకత ఉండాలి

Aug 8 2026 1:29 AM | Updated on Aug 8 2026 1:29 AM

పోలీస్‌ సేవల్లో పారదర్శకత ఉండాలి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ఎస్పీ రాజేశ్‌ చంద్ర

రిసెప్షన్‌ వర్టికల్‌ సిబ్బందితో సమీక్ష

కామారెడ్డి టౌన్‌: ప్రజలకు పోలీస్‌ శాఖ అందించే సేవల్లో వేగం, పారదర్శకత ప్రధానంగా ఉండాలని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. పోలీస్‌ స్టేషన్లలో బాధితులు ఇచ్చే ప్రతి పిటిషన్‌పై తక్షణమే స్పందించి, ఎలాంటి ఆలస్యం లేకుండా క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్స్‌ సిస్టం(సీసీటీఎన్‌ఎస్‌) పోర్టల్‌లో నమోదు చేసి వెంటనే రశీదు అందించాలన్నారు. పట్టణంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం రిసెప్షన్‌ వర్టికల్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. బాధితులకు తొలి పరిచయ వేదిక రిసెప్షన్‌ వర్టికలేనని, అందుకే ప్రతీ సిబ్బంది సానుకూల ధృక్పథంతో సేవలందించాలని తెలిపారు. సైబర్‌ నేరాల బారినపడిన బాధితుల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, తగిన మార్గదర్శకత్వం అందించాలన్నారు. అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, సదాశివనగర్‌ సీఐ సంతోష్‌ కుమార్‌, రిసెప్షన్‌ వర్టికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బండారు సంజీవులు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో పలు గ్రామాలకు చెందిన ఏడుగురు బాధితులకు మంజూరైన రూ. 5 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను నాయకులు పంపిణీ చేశారు. నాయకులు షౌకత్‌అలీ, వెంకట్‌రెడ్డి, మేకల రాజు, రంజిత్‌రెడ్డి, సుధాకర్‌రావు, గైని రాజలింగం, రాజీవ్‌కుమార్‌, రాజేశ్వర్‌రెడ్డి, భీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement