బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం విద్యుత్‌ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతాం

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు రావాలని కోరుతూ ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌, ముత్యాల పోచమ్మ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పద్మ శ్రీకాంత్‌, ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు ఆహ్వాన పత్రికను అందించారు. ఈనెల 9న ఎల్లారెడ్డిలో నిర్వహించే ముత్యాల పోచమ్మ అమ్మవారి బోనాల పండుగకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు వినోద్‌, తిరుపతి, విద్యాసాగర్‌, పప్పు వెంకటేశం, ప్యాలాల రాములు, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కుర్మ సాయిబాబా తదితరులున్నారు.

హైమాస్ట్‌ లైట్ల ప్రారంభం

ఎల్లారెడ్డిరూరల్‌: పట్టణంలోని 1వ వార్డు పరిధిలోని ఎర్రమన్ను కుచ్చ కాలనీలో హైమాస్ట్‌ లైట్లను మున్సిపల్‌ చైర్మన్‌ పద్మ శ్రీకాంత్‌ ప్రారంభించారు. కాలనీలో హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను ఆయన ప్రారంభించారు. వైస్‌చైర్‌ పర్సన్‌ మత్తమాల భాగ్యవతి, కౌన్సిలర్‌ గాయత్రి, కాంగ్రెస్‌ నాయకులు తమ్మల శ్యాం, విద్యాసాగర్‌ తదితరులున్నారు.

ఇంటిని మరిపించేలా వసతి గృహాలు

ఎల్లారెడ్డి: ఇంటిని తలపించేలా ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయని మున్సిపల్‌ చైర్మన్‌ పద్మ శ్రీకాంత్‌ అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు, నోటు బుక్కులు తదితర వస్తువులను పంపిణీ చేశారు. వైస్‌ చైర్‌ పర్సన్‌ మత్తమాల భాగ్యవతి, కౌన్సిలర్‌ గఫార్‌, వార్డెన్‌ శారద తదితరులు పాల్గొన్నారు.

మద్నూర్‌(జుక్కల్‌): విద్యుత్‌ సమస్యలను ఎప్పటికప్పుడు ట్రాన్స్‌కో సిబ్బంది పరిష్కరించాలని బాన్సువాడ ట్రాన్స్‌కో డీఈ వినోద్‌ తెలిపారు. మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో గురువారం విద్యుత్‌ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. బిచ్కుంద, మద్నూర్‌, మేనూర్‌, జుక్కల్‌ మండలాల పరిధిలో విద్యుత్‌ వినియోగదారులు తమ సమస్యలను విన్నవించారు. కొత్త విద్యుత్‌ స్తంభాలు కావాలని, వ్యవసాయ పొలాల్లో పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని వినియోగదారులు కోరారు. కొత్త అగ్రికల్చర్‌ కనెక్షన్‌కు రూ. 9,200 చెల్లించాలని, చెల్లించిన వారికి త్వరలో కనెక్షన్‌ ఇస్తామని డీఈ వినోద్‌ పేర్కొన్నారు. ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది, వినియోగదారులున్నారు.

బాన్సువాడ రూరల్‌: కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని యువజన కాంగ్రెస్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి(చిన్నా) అన్నారు. గురువారం బాన్సువాడలో ఆయన స్టిక్కర్ల ప్రచార కార్యక్రమం చేపట్టి మాట్లాడారు. నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనను కేంద్ర ప్రభుత్వం అణచివేయడానికి అనైతిక చర్యలకు పాల్పడిందని విమర్శించారు. ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.యూత్‌కాంగ్రెస్‌ బాన్సువాడ నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్‌ మన్సూర్‌, తాడ్కోల్‌ సర్పంచ్‌ అందె రమేష్‌, షోయబ్‌, గౌస్‌, ప్రశాంత్‌, లక్ష్మాగౌడ్‌, సంతోష్‌రెడ్డి, అరాఫత్‌, నవీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement