తప్పుల తడక! | - | Sakshi
Sakshi News home page

తప్పుల తడక!

Aug 7 2026 1:26 AM | Updated on Aug 7 2026 1:26 AM

తప్పుల తడక!

న్యూస్‌రీల్‌

నియోజకవర్గాల వారీగా ‘సర్‌’ వివరాలు

శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026

– 8లో u

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో భాగంగా ఓటర్ల నుంచి సేకరించిన ఎన్యూమరేషన్‌ పత్రాలను ఎప్పటికప్పుడు డిజిటలైజ్‌ చేస్తున్నారు. అయితే దాదాపు 25 శాతం ఎన్యూమరేషన్‌ పత్రాల్లో అనేక లోపాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ దరఖాస్తులను అనామలిస్‌ జాబితాలో చేర్చారు. జిల్లాలోని 796 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 6,10,501 ఎన్యూమరేషన్‌ ఫారాలు డిజిటలైజ్‌ చేశారు. ఇందులో 1,72,170 ఫారాల్లో లోపాలు ఉన్నట్టు తేల్చారు. వివరాల్లో తేడాలు సరి చేసేందుకు తాజాగా బీఎల్‌వోలకు ఎన్నికల సంఘం ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చింది. ఈ నెల 10 వరకు సరిదిద్దడానికి అవకాశం ఉంది. సర్‌కు 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకున్న నేపథ్యంలో అప్పటి వివరాలు నమోదు చేయడంలో ఏవైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకోవాల్సి ఉంటుంది. బీఎల్‌వోల వద్ద సరికాని పక్షంలో, ఈ నెల 17 తర్వాత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. అప్పుడు ఏఆర్‌వో (ఆర్డీవో)ల వద్ద ఆధారాలు చూపించడంతోపాటు డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్యూమరేషన్‌ ఫారంలో లోపాలపై నోటీసులు అందుకున్న వారు అధికారుల వద్దకు వెళ్లకుంటే వారి ఓటు హక్కు ఇబ్బందుల్లో పడినట్టే.

నియోజకవర్గం పోలింగ్‌ బూత్‌లు మొత్తం ఓటర్లు డిజిటలైజ్‌ లోపాలు ఉన్న

ఈఎఫ్‌లు దరఖాస్తులు

జుక్కల్‌ 255 2,06,343 1,86,179 56,004

ఎల్లారెడ్డి 274 2,28,503 2,06,117 53,018

కామారెడ్డి 267 2,61,160 2,18,205 63,148

గందరగోళంగా ప్రక్రియ

ఎన్యూమరేషన్‌ ఫారాల్లో పొరపాట్లు!

అనామలిస్‌ జాబితాలో

1,72,170 దరఖాస్తులు

సరిచేసేందుకు బీఎల్‌వోలకు

ఎడిట్‌ ఆప్షన్‌

భారీ తేడాలుంటే నోటీసులు జారీ

ఆధారాలతో అధికారుల

ముందుకు వెళ్లాల్సిందే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement