ఈవీఎం గోదాం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గోదాం తనిఖీ

Aug 7 2026 1:26 AM | Updated on Aug 7 2026 1:26 AM

ఈవీఎం గోదాం తనిఖీ 24న ఎల్లారెడ్డిలో జాబ్‌మేళా రీ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి బోధన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి కామారెడ్డిలో మళ్లీ వర్షం దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి క్రైం: సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ గురువారం సందర్శించారు. గోదాంలోని రికార్డులు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విక్టర్‌, ఆర్డీవో గిరి, తహసీల్దార్‌ హిమబిందు, సూపరింటెండెంట్‌ రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డిలో ఈనెల 24న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు మదన్‌మోహన్‌రావు ట్రస్టు ప్రతినిధులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేళా ఉంటుందని పేర్కొన్నారు. 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్‌ గ్రా మంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ విక్టర్‌ ఆదేశించారు. గురువారం ఆయన భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో జరుగుతున్న గ్రామ భూముల సర్వే పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్వాపూర్‌ గ్రామానికి సంబంధించి రికార్డులు లేనందున ప్రభుత్వం రీ సర్వే కార్యక్రమంను చేపట్టిందన్నారు. సర్వే పూర్తయిన తర్వాత రైతులకు వారి భూములకు సంబంధించిన సర్వే పత్రాలను అందజేస్తామన్నారు. తహసీల్దార్‌ సునీత ,బస్వాపూర్‌, సర్పంచ్‌ తుడుం పద్మ, సర్వేయర్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ నోడల్‌ అధికారి సలాం

బాన్సువాడ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ల్లో బోధించే అధ్యాపకులు నిరంతరం బో ధనా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని జిల్లా నోడల్‌ అధికారి సలాం సూచించారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లో గురువారం జిల్లా స్థాయి ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం స్పెల్‌–1 కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించి, కళాశాల ప్రాంగణంలో మొక్క లు నాటారు. అనంతరం ఆయన మాట్లా డుతూ మారుతున్న విద్యా విధానాలకు అ నుగుణంగా అధ్యాపకులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల డెవలప్‌మెంట్‌ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్‌, విఠల్‌రెడ్డి, కళాశాల ప్రిన్సి పాళ్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఫారుక్‌, ప్రిన్సిపాళ్లు యఖీనొద్దీన్‌, విజయలక్ష్మి, నారాయణ, యాదా గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో రెండు రోజుల విరామం తర్వాత గురువారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గతేడాది ఆగస్టు చివరి వారంలో కుండపోత వానతో పట్టణం అతలాకుతలమైన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి అతి భారీ వర్షం కురిసింది. గురువారం మళ్లీ వర్షంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఎల్లారెడ్డి రూరల్‌: ఎల్లారెడ్డి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రెండో విడత అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ రోపానాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో నచ్చిన కోర్సును ఎంపిక చేసు కొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement