బాన్సువాడ : బీర్కూర్ సమీపంలోని మంజీర నదిలో గురువారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పో చారం శ్రీనివాస్‌రెడ్డి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశా రు. నదిలో నూతనంగా నిర్మించిన చెక్ డ్యాంపైనుంచి నీళ్లు పరవళ్లు తొక్కుతుండడాన్ని గమనించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బీర్కూర్ శివారులోని మంజీర నదిలో రూ. 32 కోట్ల వ్యయంతో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయిన నెల రోజుల వ్యవధిలోనే భారీ వర్షాలు కురిసి చెక్ డ్యాం నిండిందన్నారు. చెక్ డ్యాం వల్ల పరిసర ప్రాంతంలోని ఆయకట్టుకు రెండు పంటలకు పుష్క లంగా సాగునీరు అందుబాటులో ఉంటుందన్నారు.
పాఠశాల సందర్శన..
బీర్కూర్‌లోని మహాత్మా జ్యోతీబా ఫూలే గురుకుల పాఠశాలను పోచారం శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. విద్యార్థుల సౌకర్యార్థం రూ.30 లక్షలతో నిర్మిస్తున్న మరుగుదొడ్లను పరిశీలించి, పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వంటశాలను సందర్శించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఆయన వెంట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శివకుమార్, కాంగ్రెస్ నాయకులు రఘు, విఠల్, శశికాంత్, పరమేశ్వర్, యామ రాములు తదితరులు ఉన్నారు.


