గుడ్డుకు బదులు అరటిపండు, పల్లిపట్టీలను అనుమతించాలి | - | Sakshi
Sakshi News home page

గుడ్డుకు బదులు అరటిపండు, పల్లిపట్టీలను అనుమతించాలి

Jul 19 2026 1:02 AM | Updated on Jul 19 2026 1:02 AM

● డీఈవోకు మధ్యాహ్న భోజన కార్మికుల వినతి

కామారెడ్డి టౌన్‌ : మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందించే కోడి గుడ్డుకు బదులుగా అరటిపండు లేదా పల్లి పట్టీ ఇచ్చేందుకు అనుమతించాలని ఏఐటీయూసీ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శనివారం కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట కార్మి కులు నిరసన తెలిపారు. అనంతరం డీఈవో మల్లికార్జున్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపునూరు చక్రపాణి మాట్లాడుతూ.. పౌష్టికాహారంలో భాగంగా విద్యార్థులకు కోడిగుడ్డు పెట్టాలన్న నిబంధనకు గానూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.6 మాత్రమే చెల్లిస్తోందన్నారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో కోడిగుడ్డు ధర రూ.8గా ఉందని, దీంతో ఒక్కో విద్యార్థిపై రూ.3ల అదనపు భారం ఏజెన్సీ నిర్వాహకులపైనే పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే కార్మికులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రూ.10 వేల వేతనం వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు బాలరాజు, దశరథ్‌, సాయిలు, దుర్గయ్య, స్వరూప, లక్ష్మి, సరిత, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement