153 సైలెన్సర్ల ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

153 సైలెన్సర్ల ధ్వంసం

Mar 5 2026 7:27 AM | Updated on Mar 5 2026 7:27 AM

కామారెడ్డి క్రైం : నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన అధిక శబ్దం చేసే సైలెన్సర్లను జిల్లా కేంద్రంలో సీజ్‌ చేసిన పోలీసులు రోడ్‌ రోలర్‌తో వాటిని బుధవారం ధ్వంసం చేశారు. నిజాంసాగర్‌ చౌరస్తాలో ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో 153 సైలెన్సర్లను రోడ్‌రోలర్‌తో తొక్కించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అఽధిక శబ్దం చేసే సైలెన్సర్లను బైక్‌లకు బిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు చేస్తామని, నిబంధలకు విరుద్ధంగా సైలెన్సర్లను బిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఎస్సై మహేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement