‘ప్రణాళిక’ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘ప్రణాళిక’ను విజయవంతం చేయాలి

Mar 5 2026 7:27 AM | Updated on Mar 5 2026 7:27 AM

వాహనాలు రావడం లేదు రెండు కి.మీ. నడవాలి..

అధ్వానంగా రోడ్లు

దశాబ్దాలు గడుస్తున్నా మారని పరిస్థితి

వర్షాలు పడితే రాకపోకలు బంద్‌

అవస్థలు పడుతున్న గిరిజనులు

99 రోజుల కార్యాచరణను

పక్కాగా అమలు చేయాలి

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

లింగంపేట(ఎల్లారెడ్డి): తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ప్రభుత్వాలు వాటి అభివృద్ధి లో మాత్రం ఎలాంటి చొరవ చూపడం లేదు. తండాలకు కనీసం సౌకర్యాల కోసం మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. కొద్ది పాటి వర్షానికే తండాలకు వెళ్లే రోడ్లు బురదమయ మై రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంటుంది. వాహనాలు రోడ్లపై నడిచే పరిస్థితి లేక గిరిజను లు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని తండాల కు కేవలం మట్టి రోడ్లు మాత్రమే ఉండడంతో ప్రతీ ఏటా రోడ్లు భారీ వర్షానికి కొట్టుకుపోయి నడవడానికి సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితని ఆయా తండాలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏళ్లుగా మట్టిరోడ్లే దిక్కు..

లింగంపేట మండలంలోని కొట్టాల్‌గడ్డ తండా, పొ ల్కంపేట తండా, సురాయిపల్లి తండా, తుల్జానాయక్‌ తండా, గట్టుమైసమ్మ తండా, రాంపల్లి తండా, శెట్పల్లి తండా, బోనాల్‌ తండా, చింతల్‌ గుట్ట తండా, లక్ష్మన్‌నాయక్‌ తండాతోపాటు పలు తండాలకు మట్టి రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ రోడ్డు వరకు తండా నుంచి వె ళ్లాలంటే రెండు కిలో మీటర్ల నుంచి 5 కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. ఎండా కాలంలో సైతం రోడ్లు గుంతలుగా మారి వాహనాలు నడపాలంటే అవస్థలు పడాల్సి వస్తుందని తండావాసులు వాపోతున్నారు. అలాగే వర్షాకాలం వచ్చిందంటే గిరిజనులు రోడ్లపై నడవాలంటే నరకయాతన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు బురదమయం కావడంతో రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం బస్తాలు, మందు సంచులు తెచ్చుకోవడానికి వాహనదారులు తండాలకు రావడానికి నిరాకరిస్తున్నారు. ఏవైనా శుభకార్యాలకు సరుకులు తెచ్చుకోవాలన్నా ఇబ్బందులు పడక తప్పడంలేదని తండాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తండాలకు అధికారులు రావడానికే ఇష్టపడడంలేదని వాపోతున్నారు. సమస్యను అధికారులకు, పాలకులకు పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్పటికై నా అధికారులు, పాలకు స్పందించి తండాలకు రోడ్లు వేసి తమ బతుకులు మార్చాలని కోరుతున్నారు.

తండా నుంచి ఆర్‌అండ్‌బీ రోడ్డుకు రావాలంటే మూడు కిలో మీటర్లు నడవాలి. సురాయిపల్లి నుంచి తండాకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారడంతో సైకిలు, ద్విచక్ర వాహనాలు నడవడం కష్టంగా ఉంటుంది. వేరే ప్రాంతాల నుంచి సరుకులు తెచ్చుకోవాలంటే తండాకు ఎలాంటి వాహనాలు రావడానికి ఇష్టపడడంలేదు. అధికారులు, నాయకులు స్పందించి, బీటీ రోడ్లు వేయాలి.

–బోడ తౌర్యా, సురాయిపల్లి ఎర్రోళ్ల తండా

తండా నుంచి ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు వెళ్లాలంటే రెండు కిలో మీటర్లు నడవాల్సి ఉంది. ఒంటర్‌ పల్లి నుంచి గట్టుమైసమ్మ తండా వరకు పంట చేనుల నుంచి రోడ్డు ఇరుకుగా ఉండి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఉంటుంది. తండాలో ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు పై తరగతులకు వెళ్లాలంటే మండల కేంద్రానికి వెళ్లాలి. వర్షాకాలం వస్తే రోడ్డు అధ్వానంగా మారుతుంది.

–రమావత్‌ రాజు, సురాయిపల్లి స్కూల్‌ తండా

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

కామారెడ్డి క్రైం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ను విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. 99 రోజుల కార్యాచరణను పకడ్బంధీగా అమలు చేయాలన్నారు. పట్టణంలోని కలెక్టరేట్‌లో బుధవారం సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో మార్చి 6 నుంచి జూన్‌ 12 వ రకు ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక‘ కింద ఐ దు దశల్లో 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించినట్లు వివరించారు. దీనిని శాఖల వారీగా 10 థీమ్‌లతో పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రణాళిక శాఖ ఈ కార్యక్రమానికి నోడల్‌ శాఖగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఐ దు దశల్లో భాగంగా ఏప్రిల్‌ 2న గ్రామ స్థాయిలో గ్రామసభలు, ఏప్రిల్‌ 16న మండల స్థాయి, మే 2న నియోజకవర్గ స్థాయి, మే 22న జిల్లాస్థాయి కార్యక్రమాలు ఉంటాయన్నారు. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్రస్థాయి కా ర్యక్రమం ఉంటుందని వెల్లడించారు. అలాగే మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆ ధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 99 రోజుల కాలంలో శాఖ ల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప నులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ని ర్వహించనున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్‌ ప్ర కారం అన్ని కార్యక్రమాలను విస్తృతంగా, ఎ లాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు నిర్వహించిన కార్యక్రమాలపై శాఖల వారీగా నిత్యం ప్రగతి నివేదికలు సమర్పించాలన్నారు. కార్యక్రమాల అమలుపై నిరంతర పర్యవేక్షణ కొనసా గుతుందని తెలిపారు. వివిధ శాఖల అధికారు లు తదితరులు పాల్గొన్నారు.

అధ్వానంగా కొట్టాల్‌గడ్డ తండా రోడ్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement