● పౌర సరఫరాల సంస్థలో ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి సీఎంఆర్ మింగేసే ఎత్తుగడ
● అవుట్ సోర్సింగ్ ఉద్యోగే సూత్రధారి
● తనిఖీల్లో గుర్తించిన అధికారులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కస్టం మిల్లింగ్‌లో మరో అక్రమ దందా వెలుగు చూసింది. ఫేక్ ఐడీలను క్రి యేట్ చేసి మూడు రైస్ మిల్లుల నుంచి రూ. 2 కో ట్ల విలువైన 6,960 క్వింటాళ్ల బియ్యాన్ని గోదాములకు చేర్చి నట్టు రికార్డుల్లో నమో దు చేశారు. గింజ కూడా సరఫరా చేయకుండానే ఇచ్చినట్టు రి కార్డుల్లో నమోదైంది. కస్టం మిల్లింగ్‌కు సంబందించి మిల్లర్లకు కేటాయింపులు, మరపట్టించిన త రువాత బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించిన లెక్కలను పరిశీలించే క్రమంలో లెక్కల్లో తేడాలు ఉన్నట్టు పౌరసరఫరాల సంస్థ అధికారులు గుర్తించారు.
ఉద్యోగి తొలగింపు..
ఔట్ సోర్సింగ్ పద్ధతిన మండల లెవల్ కో–ఆర్డినేట ర్ ఉద్యోగం చేస్తున్న సదరు కంప్యూటర్ ఆపరేటర్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు. సీఎంఆర్ బియ్యం విషయంలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అక్రమాలకు పాల్పడిన సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అధికారులు టర్మినేట్ చేశారు. అలాగే సదరు ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో కుట్రలో భాగమైన మూడు రైస్ మిల్లులపైనా చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారి శ్రీకాంత్‌ను ‘సాక్షి’ వివరణ అడుగగా ఫేక్ ఐడీలతో అక్రమాలకు పాల్పడ్డ సదరు ఉద్యోగిని తొలగించామని తెలిపారు. అధికారుల లాగిన్‌లో జరగాల్సిన వ్యవహారం మొత్తం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తయారు చేసుకున్న ఫేక్ ఐడీల ద్వారా గోదాములకు బియ్యం రాకున్నా, వచ్చినట్టు నమోదు చేయడం పౌరసరఫరాల సంస్థలో సంచలనం కలిగించింది. సాధారణంగా సీఎంఆర్ బియ్యం తిరిగి ఇవ్వకుండా సొంతానికి వాడుకోవడం, తిరిగి ఇవ్వకుండా మొండికేయడం వంటివి చూస్తుంటాం. ఇప్పుడు ఫేక్ ఐడీలతో పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపడాన్ని చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ప్రతీ సీజన్‌లో రూ. వందల కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించడం, బియ్యాన్ని రికవరీ చేసే పౌరసరఫరాల సంస్థలో ఫేక్ ఐడీలతో భారీ కుట్ర జరగడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. కాగా ఇదే మొదటి సారి జరిగిందా ? గతంలో ఇలాంటివి జరిగాయా ? అన్నదానిపై మరింత లోతైన దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది.
మిల్లర్లతో మాట్లాడుకొని..
సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)ను ప్రభుత్వానికి ఇవ్వకుండానే ఇచ్చినట్లు సదరు శాఖలో పనిచేసే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నడిపిన వ్యవహారం బయటపడింది.
రికార్డుల్లో బియ్యం ఇచ్చినట్లు ఫేక్ ఐడీలతో నమోదు చేయగా, అధికారుల తనిఖీల్లో తేడాలు రావడంతో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి పౌరసరఫరాల సంస్థ ద్వారా రైస్ మిల్లులకు కేటాయిస్తుంది. మిల్లు సామర్థ్యం ఆధారంగా కేటాయింపులు జరుగుతాయి. ఆయా మిల్లులు ధాన్యాన్ని మరపట్టించి బియ్యాన్ని నిర్ణీత సమయంలో తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. అయితే సులువుగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో సదరు సంస్థలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తన మేధస్సును ఉపయోగించి ఫేక్ ఐడీలు క్రియేట్ చేశాడు. మిల్లర్లతో మాట్లాడుకుని గింజ బియ్యం ఇవ్వకుండానే 6,960 క్వింటాళ్లు (24 ఏసీకేలు) మిల్లుల నుంచి గోదాములకు చేరినట్టు రికార్డుల్లో నమోదు చేశాడు. ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా అంతా కానిచ్చేశాడు. అయితే ధాన్యం కేటాయింపు, బియ్యం రికవరీ లెక్కలు చూసే క్రమంలో అధికారులు లెక్కల్లో తేడాలను గుర్తించారు.
బియ్యం కేటాయింపుల నుంచి బియ్యం రికవరీ వరకు అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే కంప్యూటర్ ఆపరేటర్‌ను లెక్కల్లో తేడాల గురించి అధికారులు ప్రశ్నించడంతో వ్యవహారం బయటపడింది. దీనిపై సదరు ఆపరేటర్‌ను నిలదీయడంతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసిన విషయం తెలుసుకుని అధికారులు ఖంగుతిన్నారు.


