యూరియా కోసం రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం రైతుల ఆందోళన

Mar 5 2026 7:27 AM | Updated on Mar 5 2026 7:27 AM

రెండు నిమిషాల్లో.. 666 బస్తాలు బుక్‌

గున్కుల్‌ సొసైటీ ముట్టడి

కార్యాలయ ఫర్నిచర్‌ ధ్వంసం

నిజాంసాగర్‌(జుక్కల్‌): యాసంగి పంటలు సాగు చే సిన రైతులు యూరియా బస్తాల కోసం ఆందోళన లు చేపడుతున్నారు. మహమ్మద్‌ నగర్‌ మండల కేంద్రంలోని గున్కుల్‌ సొసైటీ కార్యాలయాన్ని బుధవా రం పలు గ్రామాల రైతులు ముట్టడించారు. ఫర్టిలై జర్‌ యాప్‌లో యూరియా బుక్‌ చేద్దామన్నా, నో స్టాక్‌ అని రావడంతో ఆగ్రహించిన కొందరు రైతు లు సొసైటీ కార్యాలయం ఫర్నిచర్‌ను ధ్వంసం చేశా రు. సొసైటీ ఉద్యోగుల పనితీరు పట్ల నిరసన వ్య క్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సొ సైటీ కార్యాలయానికి చేరుకొని, ఆందోళన చేస్తున్న రైతులను శాంతింపజేశారు. మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సర్పంచులు రమేష్‌యా దవ్‌, గజ్జల జీవన్‌, కిరణ్‌ కాంగ్రెస్‌ నాయకుడు లో క్యానాయక్‌ సొసైటీకి చేరుకున్నారు. సమస్యను జి ల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రెడ్డి దృష్టికి తీ సుకువెళ్లారు. రెండు రోజుల్లో 1,000 బస్తాల యూ రియాను గున్కుల్‌ సొసైటీకి సరఫరా చేస్తామని చెప్పడంతో రైతులు నిరసన విరమించారు.

గున్కుల్‌ సొసైటీకి 666 బస్తాల యూరియా రావడంతో సొసైటీ సిబ్బంది బుధవారం ఉదయం 9.30కి ఫర్టిలైజర్‌ యాప్‌లో స్టాక్‌ పెట్టారు. కేవలం 2 నిమిషాల వ్యవధిలో మొత్తం బస్తాలు బుక్‌ అయ్యాయి. దాంతో మిగితా రైతులకు బుకింగ్‌ అవకాశం లేకపోవడంతో ఆందోళన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement