నిజామాబాద్ రూరల్: నగరంలోని ఆర్‌పీ రోడ్డులో ఆర్‌ఎస్ బ్రదర్స్ షోరూం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రముఖ సినీనటి నిధిఅగర్వాల్, నగర్ మేయర్ ఉమారాణి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేశారు. ఈసందర్భంగా నటి నిధి అగర్వాల్ మట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఆర్‌ఎస్ బ్రదర్స్ సరికొత్త షోరూ మ్‌ను ప్రారంభించడం ద్వారా ఆర్‌ఎస్ బ్రదర్స్ మరో మైలురాయిని చేరుకుందన్నారు. సౌత్ ఇండియాలో కుటుంబ షాపింగ్ అవసరాలను తీర్చే విశ్వసనీయ సంస్థగా, ఏకై క గమ్యంగా ఆర్‌ఎస్ బ్రదర్స్ ఉందన్నారు. షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన సినీ నటిని చూడడానికి ఆమె అభిమానులు తరలివచ్చారు.


