రామారెడ్డి: గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలను గురువా రం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. విద్యార్థు ల సామర్థ్యాలను పరీక్షించారు. వారికి నోట్ బుక్స్ అందించారు. పాఠశాలలోని వంటగదిని సందర్శించి రాగి జావాను పరిశీలించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న మెరుగు లక్ష్మి ఇంటిని పరిశీలించారు. వచ్చే ఉగాది వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయా లని సూచించారు. ఆయన వెంట డీఈవో రాజు, హౌ జింగ్ పీడీ విజయపాల్‌రెడ్డి, ఆర్డీవో వీణ, తహసీల్దార్ ఉమాలత, సర్పంచ్ కిషన్‌యాదవ్ తదితరులున్నారు.


