బిచ్కుంద ఆస్పత్రికి ఇద్దరు కొత్త వైద్యులు | - | Sakshi
Sakshi News home page

బిచ్కుంద ఆస్పత్రికి ఇద్దరు కొత్త వైద్యులు

Apr 11 2025 1:29 AM | Updated on Apr 11 2025 1:29 AM

బిచ్కుంద ఆస్పత్రికి  ఇద్దరు కొత్త వైద్యులు

బిచ్కుంద ఆస్పత్రికి ఇద్దరు కొత్త వైద్యులు

బిచ్కుంద: మండల కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిలో ఉన్నతాధికారులు కొత్తగా ఇద్దరు డాక్టర్లను నియమించారు. గైకాలజిస్టుగా డాక్టర్‌ పిట్లెవార్‌ స్వప్నాలి, ఆర్ధోపెడిక్‌ డాక్టర్‌గా రాకేశ్‌ విధుల్లో చేరి బాధ్యతలు స్వీకరించారు. మొత్తం నలుగురు వైద్యులు ఆస్పత్రిలో ఉన్నారని సూపరింటెండెంట్‌ కాళిదాస్‌ తెలిపారు. గైనకాలజిస్టు వైద్యురాలు రావడంతో ఎ మ్మెల్యే లక్ష్మీకాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు.

వంద శాతం పన్ను వసూలు

బిచ్కుంద: జిల్లా అన్ని గ్రామ పంచాయతీల్లో వంద శాతం పన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని డీపీవో మురళి అన్నారు. ఇప్పటి వరకు 99 శాతం పన్ను వసూలైందన్నారు. బిచ్కుంద గ్రామ పంచాయతీని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో తాగునీటి సమస్య తల్తెకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. మిషన్‌ భగీరథ మంచినీళ్లు పచ్చగా రంగు మారి వస్తున్నాయని డీపీవో దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. మిషన్‌ భగీరథ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్‌ జీపీ సిబ్బంది ఉన్నారు.

అధికారం కోసం బీజేపీ

కార్యకర్తలు కృషి చేయాలి

కామారెడ్డి టౌన్‌ : తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రభారి గడ్డం శ్రీనివాస్‌ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల 11, 12, 13 తేదీలలో జరిగే ‘గావ్‌ చలో – బస్తీ చలో అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలలో, పట్టణంలోని అన్ని వార్డుల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి, నాయకులు వేణు, వెంకట్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతు పడిగాపులు

నస్రుల్లాబాద్‌(బాన్సువాడ): మండలంలోని బొప్పాస్‌పల్లిలో రోడ్డు వద్ద ధాన్యం బస్తాలకు ఫకీరా నాయక్‌ తండాకు చెందిన రైతు పాండు కాపలా కాస్తున్నాడు. ధాన్యం మేచర్‌ రావడంతో మైలారం పీఎసీఎస్‌కి చెందిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాడు. లారీల కొరతతో సగం ధాన్యం బస్తాలు తీసుకెళ్లారని మిగితావి ఎప్పుడూ తీసుకెళ్తారో తెలియడంలేదని, అకాల వర్షాల కారణంగా ధాన్యం బస్తాలు తడిచిపోతున్నాయని రైతు వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement