Telangana Crime News: పెళ్లి రోజే వరుడి మృతదేహంతో..! అలుముకున్న విషాదం..!!
Sakshi News home page

పెళ్లి రోజే వరుడి మృతదేహం.. అసలేం జరిగింది?

Sep 8 2023 1:34 AM | Updated on Sep 8 2023 11:06 AM

- - Sakshi

కామారెడ్డి: పెళ్లి రోజే వరుడి మృతదేహం లభ్యమైన ఘటన సదాశివనగర్‌ మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మొసర్ల చిన్న నర్సింహులుకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడైన రాజేందర్‌రెడ్డి(29) వివాహం రాంపూర్‌కు చెందిన అమ్మాయితో గురువారం జరగాల్సి ఉంది. రాజేందర్‌రెడ్డి అన్న శ్యామ్‌రెడ్డి ఇద్దరు కలిసి పెళ్లి పత్రికలను ఇటీవల బంధువులకు పంచారు.

ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిన రాజేందర్‌రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. స్థానికుల సమాచారం మేరకు లింగంపేట మండలం ఎల్లారం అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని రాజేందర్‌రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తెలిపారు.

లింగంపేట ఏఎస్సై ప్రకాశ్‌ కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement