జాతీయస్థాయి స్విమ్మింగ్‌ టోర్నీకి ఎంపిక.. మిట్టపల్లి రిత్విక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి స్విమ్మింగ్‌ టోర్నీకి ఎంపిక.. మిట్టపల్లి రిత్విక

Jul 31 2023 12:54 AM | Updated on Jul 31 2023 12:05 PM

- - Sakshi

నిజామాబాద్‌: హైద్రాబాద్‌లోని పబ్లిక్‌స్కూల్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ సబ్‌ జూనియర్‌, జూనియర్‌ టోర్నీలో జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక సత్తా చాటింది.

జిల్లా తరఫున 50, 100, 200మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో బంగారు, 200మీటర్లలో కాంస్య పతకంతో సాధించింది. ఆగస్టు 16 నుంచి 20వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జరగనున్న జాతీయస్థాయి సబ్‌జూనియర్‌ టోర్నీకి ఆమె ఎంపికైంది.

ఈ సందర్భంగా రాష్ట్ర స్విమింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, ఉమేష్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడీల శ్రీరాములు, మహిపాల్‌రెడ్డి తదితరులు ఆమెను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement