రత్నగిరిపై భక్తులకు ఊరట | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై భక్తులకు ఊరట

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

అన్నవరం: కార్తిక మాసం రద్దీ నేపథ్యంలో రత్నగిరిపై సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో ‘ఇవేం కష్టాలు దేవుడా’ అనే శీర్షికన వచ్చిన కథనానికి దేవస్థానం అధికారులు స్పందించారు. దీంతో సోమవారం స్వామివారి దర్శనానికి నుంచి క్యూలో వేచియున్న భక్తులకు పలుచోట్ల మంచినీటి క్యాన్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా రథపాత్‌లోని క్యూ, ఆలయ ప్రాంగణంలో భక్తుల వద్దకు మొబైల్‌ క్యాన్ల ద్వారా మంచినీరు సరఫరా చేశారు. అదే విధంగా క్యూలో ఫ్యాన్లకు మరమ్మతులు చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement