అరాచక పర్వం | - | Sakshi
Sakshi News home page

అరాచక పర్వం

Nov 23 2026 5:36 AM | Updated on Nov 23 2026 5:36 AM

తొండంగి: పల్లె పోరులో టీడీపీ బరి తెగించింది.. ఓటమి భయంతో దౌర్జన్యకాండకు దిగింది.. వేమవరంలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు పంచాయతీ వార్డు స్థానాలకు నామినేషన్లు వేయకుండా కూటమిలోని టీడీపీ నాయకులు బీభత్సకాండ సృష్టించారు. రెండు రోజులుగా తొండంగి మండలంలోని 22 పంచాయతీలకు సంబంధించి ఆరు కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ సాగుతోంది. కానీ వేమవరంలో ఆదివారం టీడీపీ, వైఎస్సార్‌ సీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ పంచాయతీలో ఒకటి, రెండు, మూడు, నాలుగు వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులను ముందు రోజు శనివారం రాత్రి నుంచే టీడీపీ వర్గీయులు ఇళ్లకు వెళ్లి నామినేషన్లు వేస్తే చంపుతామని బెదిరింపులకు దిగారు. దీనిపై ఆయా వర్గాల గ్రామ పెద్దలు ఆదివారం గ్రామంలో ప్రధాన సెంటర్లో చర్చించుకునే నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది. వేమవరం పంచాయతీలో మత్స్యకార ప్రజలు ఉండే పంపాదిపేట గ్రామం కూడా ఉంది. ఈ రెండు గ్రామాల్లో యాదవ, మత్స్యకార సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారు. ప్రశాంతంగా ఉండే కోన ప్రాంతంలో మళ్లీ పంచాయతీ ఎన్నికల కారణంగా రాజకీయ చిచ్చు రేగింది. ఆదివారం రాత్రి వేమవరం, పంపాదిపేట గ్రామాల్లో పలువురు ఇళ్లకు వెళ్లి టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. దీంతో పంపాదిపేటకు చెందిన గోసల దేవుడు, గోసల నూకరాజు, మడదా శ్రీను తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్లకు వెళ్లి దాడులు చేయడం వంటి సంఘటనలతో రెండు గ్రామాల ప్రజలు భయందోళన చెందుతున్నారు.

వైఎస్సార్‌ సీపీ నేతలపై కేసులకు ప్రయత్నం?

వేమవరంలో జరిగిన ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేతలు మారేటి కృష్ణ, మారేటి శ్రీను, మారేటి సూరయ్య, యాదాల రామకృష్ణ, నేమాల గోవిందు, నేమాల దొరబాబు మరికొందరిపై కేసులు నమోదుకు టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఇప్పటికే వైఎస్సార్‌ సీపీ నాయకులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి విచారిస్తున్నట్టు తెలిసింది. బెదిరింపులకు పాల్పడిన టీడీపీ నేతలపై కేసులు పెట్టకుండా తమపై అక్రమంగా కేసులు నమోదు చేస్తుండటం అన్యాయమని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు వాపోయారు.

పంపాదిపేటలో టీడీపీ వర్గీయుల దాడిలో

గాయపడిన గోసల దేవుడు, చేతికి గాయం

ఫ టీడీపీ నేతల దౌర్జన్యకాండ

ఫ వైఎస్సార్‌ మద్దతుదారులకు

బెదిరింపులు

ఫ సభ్యులుగా నామినేషన్లు

వేయకుండా అడ్డగింపు

ఫ ఇళ్లకు వెళ్లి దాడి,

పలువురికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement