నేడు, రేపు అగ్రిగోల్డ్‌ బాధితుల వివరాల నమోదు | - | Sakshi
Sakshi News home page

నేడు, రేపు అగ్రిగోల్డ్‌ బాధితుల వివరాల నమోదు

Nov 23 2026 5:36 AM | Updated on Nov 23 2026 5:36 AM

అమలాపురం టౌన్‌: అగ్రిగోల్డ్‌ బాధితుల నుంచి బాండ్లు, డిపాజిట్ల వివరాలను కాకినాడ భానుగుడి సెంటర్‌ సమీపంలోని పాత జిల్లా పోలీసు కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో నమోదు చేసుకుంటారు. ఈ రోజుల్లో కాకినాడ జిల్లాలోని అన్ని మండలాలు, కోనసీమ జిల్లా అమలాపురం, అయినవిల్లి మండలాలకు చెందిన బాధితులకు మాత్రమే అవకాశం ఉంటుందని స్థానిక ఎస్పీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని జిల్లాలు, మండలాలకు చెందిన బాధితుల నుంచి తేదీల వారీగా వివరాలు నమోదు చేసుకుంటారని, దీనిపై ఆందోళన చెందనవసరం లేదని పేర్కొన్నారు. బాధితులు తమ వెంట ఒరిజినల్‌ అగ్రిగోల్డ్‌ బాండ్‌, రశీదును పరిశీలనకు మాత్రమే తీసుకుని వెళ్లాలి. బాండ్‌ అధికారులకు ఇవ్వనసరం లేదు. అలాగే, సంతకం చేసిన బాండ్‌ కలర్‌ జిరాక్స్‌, ఆధార్‌, పాన్‌కార్డుల జిరాక్స్‌లు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ మొదటి పేజీ జిరాక్స్‌, పాస్‌పోర్టు సైజు ఫొటో, మొబైల్‌ నంబర్‌, డిపాజిటర్‌ మరణించినట్లయితే మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ, చట్టబద్ధ వారసులకు సంబంధించిన పత్రాలు వెంట తీసుకుని వెళ్లాలి. ఇతర వివరాలకు 97043 41016, 96526 87724 నంబర్లలో సంప్రదించాలని రాజమహేంద్రవరం సీఐడీ ప్రాంతీయ కార్యాలయం తెలిపింది.

నామినేషన్లకు అనుమతించడం లేదని ఆందోళన

ప్రత్తిపాడు: నామినేషన్ల దాఖలుకు వచ్చిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను అనుమతించడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ప్రత్తిపాడు నామినేసన్ల స్వీకరణ కేంద్రం వద్ద ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల వారిని నిలువరించి, అధికార పక్షం వారిని అనుమతించారని రాచపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు బంకు శ్రీను (ఏనుగు శ్రీను) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నామినేషన్లు వేసేందుకు వస్తే తమను కాదని, అధికార పక్షం వారిని అనుమతించారంటూ ఆయన మండిపడ్డారు. పంచాయతీ అధికారులు అధికార పక్షం వారినే లోనికి రానిస్తున్నారని అన్నారు. దీంతో ప్రత్తిపాడు ఎస్సై ఎస్‌.లక్ష్మీకాంతం జోక్యం చేసుకుని, రాచపల్లి వైఎస్సార్‌ సీపీ నాయకుడు బంకు శ్రీను వర్గాన్ని సముదాయించారు. దీంతో రాచపల్లి సర్పంచ్‌ అభ్యర్థిగా బంకు శ్రీను, పలువురు వార్డు సభ్యులుగా నామినేసన్లు దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement