ప్రగతి పథం వైపు రండి.. | - | Sakshi
Sakshi News home page

ప్రగతి పథం వైపు రండి..

Nov 23 2026 5:36 AM | Updated on Nov 23 2026 5:36 AM

సోమవారం శ్రీ 23 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

ఫ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించండి

ఫ మాజీ మంత్రులు కన్నబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పిలుపు

కాకినాడ రూరల్‌: కాకినాడ నగరాన్ని ప్రగతి పథం వైపు నడిపించేందుకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలకు అందుబాటులో ఉండే వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి కాదా సత్యశ్రీని గెలిపించాలని కోరారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున మేయర్‌ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న కాదా సత్యశ్రీ, ఆమె భర్త వెంకటరమణ అనేక సేవా కార్యక్రమాలు చేపతున్నారని అన్నారు. రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని 1, 2, 65, 66వ డివిజన్లలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒకటో డివిజన్‌ అభ్యర్థి మాదబోయిన నేరేళ్లు, 2వ డివిజన్‌ అభ్యర్థి వడ్డి మణికుమార్‌, 65వ డివిజన్‌ అభ్యర్థి గుత్తుల సూర్యప్రకాష్‌, 66వ డివిజన్‌ అభ్యర్థి పాటి సూరిబాబులను ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement