వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై కుట్రలు మానుకోవాలి! | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై కుట్రలు మానుకోవాలి!

Nov 23 2026 5:36 AM | Updated on Nov 23 2026 5:36 AM

పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు

పెద్దాపురం ఆర్డీఓకు వినతిపత్రం అందిస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకుడు పాఠంశెట్టి సూర్యచంద్ర, సర్పంచ్‌ అభ్యర్థి అరుణ

పెద్దాపురం: వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై కుట్రలు మానుకోవాలని జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ నాయకుడు పాఠంశెట్టి సూర్యచంద్ర అన్నారు. ఈ మేరకు పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆదివారం ఆయన నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థి గండికోట అరుణ నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడం సరికాదని వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాఠంశెట్టి సూర్యచంద్ర విలేకరులతో మాట్లాడుతూ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థిగా గండికోట అరుణ నామినేషన్‌ దాఖలు చేశారన్నారు. నామినేషన్‌ పత్రంలో అరుణ భర్త కుల ధ్రువీకరణ పత్రంలో అక్షర దోషం నెపంతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి స్క్రూట్నీలో తిరస్కరించారన్నారు. నామినేషన్‌ పత్రాల్లో చిన్న దోషాలున్నా, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నామినేషన్లు ఆమోదించాలని ఇటీవల హైకోర్టు సృష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీనిని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పట్టించుకోకుండా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కనుసన్నల్లో నాటకం ఆడి నామినేషన్‌ను తిరస్కరించారని అన్నారు. కూటమి ప్రభుత్వంలోని అధికారులు జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు కూడా పనిచేయనీయకుండా జగ్గంపేట ఎమ్మెల్యే అడ్డుకున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు తప్పిదాలు చేసి, రాజకీయ పార్టీలపై రుద్దడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. నామినేషన్‌ తిరస్కరణపై అప్పీలు కోసం పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి ఉదయాన్నే వస్తే రెవెన్యూ అధికారులు కార్యాలయంలో అందుబాటులో లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు బైఠాయించారని తెలుసుకున్న పెద్దాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, ఎస్సై యు.పాపారావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విషయంపై ఆరా తీసి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్డీఓ పి.కృష్ణమూర్తి కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల నుంచి వినతిపత్రం తీసుకున్నారు. కార్యక్రమంలో బి.వీర్రాజు, ఎం.సత్తిబాబు, ఎన్‌.ప్రసాద్‌, నానాజీ, పాపారావు, డి.శ్రీను, వి.గంగాధర్‌, వాసంశెట్టి గాంధీ తదితరులు పాల్గొన్నారు.

ఫ ఆర్డీఓ కార్యాలయం వద్ద

కార్యకర్తల బైఠాయింపు

ఫ కాట్రావులపల్లి సర్పంచ్‌ అభ్యర్థి

నామినేషన్‌ తిరస్కరణపై ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement