ఓట్లు అడగండి! | - | Sakshi
Sakshi News home page

ఓట్లు అడగండి!

Nov 16 2026 12:02 AM | Updated on Nov 16 2026 12:02 AM

లో

సోమవారం శ్రీ 16 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
ఈ దారిలో రండి..
కాకినాడ నగర సమాచారం

జనాభా

5.75 లక్షలు

ఓటర్లు

3,12,182

విస్తీర్ణం: చదరపు కిలోమీటర్లు

30.51

రోడ్ల విస్తీర్ణం

719.21 కి.మీ.

పేరుకు స్మార్ట్‌ సిటీ.. వెళ్లే దారిలో మాత్రం కాళ్ల కింద కరకరమంటోంది. ఎటెళ్లినా నరకం కనిపిస్తోంది.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోడ్ల పరిస్థితి అగమ్యగోచరంలా తయారైంది. ఎక్కడికక్కడే గుంతలు పడి, ఆపై కంకర తేలి రహదారులు అధ్వానంగా మారాయి. వీటికి మరమ్మతుల పేరుతో అధికారులు తూతూమంత్రంగా పనులు చేపడుతున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల వేళ అధికార పార్టీ నేతలు ఈ దారిలో వచ్చి ఎలా ఓట్లు అడుగుతారో చూస్తామని ప్రజలు అంటున్నారు.

బోట్‌క్లబ్‌ (కాకినాడ): రోడ్లను చూసి జనం ‘దుమ్మెత్తి’పోస్తున్నారు.. అడుగుకో గుంత, ఆపై తేలిన కంకరను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల వేళ ఇది కూటమికి ఇబ్బందిగా మారింది. నగరంలో చాలా ప్రాంతాల్లో రహదారులు పాడయ్యాయి. పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోడ్ల అభివృద్ధిని పట్టించుకోక ఎక్కడిక్కడే అధ్వానంగా తయారయ్యాయి. కొన్నిచోట్ల తూతూమంత్రంగా గోతులను పూడ్చినా, నాసిరకం పనులతో పరిస్థితి మొదటికే వస్తోంది. రహదారులపై పడిన గోతుల్లో కేవలం గులకరాళ్లు, కంకర వేసి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. వాటిపై కనీసం సిమెంట్‌, తారు కానీ వేయకపోవడంతో వాహనాలు ప్రయాణించే సమయంలో రాళ్లు పైకి లేస్తున్నాయి. మరికొన్ని చోట్ల వేసిన కంకరను రోలింగ్‌ చేయకపోవడంతో రాళ్లన్నీ రహదారిపై చెల్లాచెదురుగా పడుతున్నాయి.

కంకరేసి.. నిధులు సర్దేసి

కాకినాడ నగరంలో గుంతలు పడిన రహదారులకు మరమ్మతుల పేరిట అధికారులు, ప్రజాప్రతినిధులు జేబులు నింపుకొంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక అశోక్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌, శాంతినగర్‌, గాంధీనగర్‌, రామారావుపేట తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు ఇటీవల మరమ్మతులు చేశారు. అలాగే ప్రధాన రహదారుల్లో సైతం గోతులను పూర్తి స్థాయిలో పూడ్చకుండా కంకర వేసి వదిలేశారు. దీనివల్ల నడిచేవారికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. వాహనాలపై వెళ్లేవారు అదుపుతప్పి పడిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

నాణ్యత సం‘గోతులు’ ఇలా..

గోతులు పూడ్చేందుకు కేవలం రాళ్లు వేసి వదిలేశారు. దీనివల్ల ప్రయోజనం లేకపోగా, ఆ రాళ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకవైపు గోతులు, మరోవైపు చెల్లాచెదురుగా పడిన కంకరతో వాహనదారులు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ శాఖ ఆధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోవడంతో నాసిరకంగా పనులు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కార్పొరేషన్‌ జనరల్‌ ఫండ్స్‌ నుంచి మరమ్మతుల కోసం రూ.లక్షలు కేటాయించినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికై నా రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

రామారావుపేట ప్రధాన రహదారిపై

చెల్లాచెదురుగా ఉన్న రాళ్లు

కాకినాడ శాంతినగర్‌ మదర్‌థెరిసా విగ్రహం వద్ద

ప్రధాన రహదారిపై తేలిన గోతుల్లో వేసిన రాళ్లు

8

ఫ కూటమి పాలనలో

అధ్వానంగా రహదారులు

ఫ కాకినాడలో రోడ్లపై నడకే నరకం

ఫ మరమ్మతుల పేరిట నిధుల వృథా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement