మహిపాలవీధి ఊరేగింపులో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

మహిపాలవీధి ఊరేగింపులో అగ్నిప్రమాదం

Oct 22 2026 12:39 AM | Updated on Oct 22 2026 12:39 AM

● కిరోసిన్‌ డబ్బాలతో ఉన్న వ్యాన్‌ దగ్ధం

● ఇద్దరికి తీవ్ర గాయాలు

అమలాపురం టౌన్‌: దసరా ఊరేగింపుల్లో మహిపాల వీధిలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించడంతో ఉత్సవ కమిటీ పెద్దలు ఆందోళనకు గురయ్యారు. స్థానిక వెంకటేశ్వర దేవస్థానం సమీపంలో 216 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడి స్థానిక కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊరేగింపులో చెడీ తాలింఖానా ప్రదర్శనల్లో ఉపయోగించే అగ్గి బరాటాల కోసం ఉపయోగించే కిరోసిన్‌ను డబ్బాలలో నింపి వ్యాన్‌లో తరలిస్తుండగా ఓ తారాజువ్వ వచ్చి పడింది. దీంతో వ్యాన్‌లో మంటలు చెలరేగినట్టు ఉత్సవ కమిటీ ప్రతినిధులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో కిరోసిన్‌తో వస్త్రాలు అందించే వ్యక్తులు మోర్త శ్రీనివాసరావు, గోసంగి రాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి శరీరంపై పలు చోట్ల కాలిన గాయాలయ్యాయి. వ్యాన్‌ నుంచి మంటలు ఎగిసి పడడంతో జనం బెంబేలెత్తారు. మంటల ధాటికి పక్కనే ఉన్న ఓ రేకుల గోడ స్వల్పంగా దెబ్బతింది. అమలాపురం అగ్నిమాపక దళం, ఊరేగింపు నిర్వాహకులు మంటలను అదుపు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement