పెద్దాపురం: పెద్దాపురం మండల వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పల్ల రాజ్యలక్ష్మిని పార్టీ ఆదివారం ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు పార్టీ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆదేశాలతో రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె భర్త కాండ్రకోట వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అలాగే గతంలో సొసైటీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు.
అమ్మో... అర్ణబ్
భయపెడుతున్న తుపాను హెచ్చరికలు
కాకినాడ రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారి తీవ్ర తుపానుగా మారుతుందనే హెచ్చరికలు భయపెడుతున్నాయి. తుపానుకు అర్ణబ్‌గా నామకరణం చేయడంతో పాటు కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంటుందని అంచనాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాన్ ప్రభావం మంగళవారం నుంచి ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొనడంతో మత్స్యకారులు సముద్రం నుంచి ఒడ్డుకు చేరుకుంటున్నారు. భారీ వర్షాలు, గాలులతో పాటు సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఖరీఫ్ వరి చేలు ఈనిక, గింజ తోడుకునే దశలో ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈదురు గాలులు బలంగా వీస్తే వరి చేలు నేలకొరిగే ప్రమాదం ఉందని, తద్వారా పంట సష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు. తుపాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూతో పాటు అన్ని శాఖలు అధికారులు అప్రమత్తమయ్యారు.
ముందస్తు చర్యలు తీసుకోండి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28న జిల్లాలోని తీర ప్రాంతాలతో పాటు ఇతర మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదివారం తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిత్యావసర సరుకులు, ఇంధనం, వంట గ్యాస్‌కు కొరత రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు ఇబ్బంది లేకుండా జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరకులు వర్షపు నీటిలో తడిచిపోకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు సెలవులు పెట్టరాదని, తమ మండల కేంద్రాల్లోనే అందుబాటులో ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని అన్నారు.
నేడు పోలీస్ పీజీఆర్‌ఎస్ రద్దు
కాకినాడ క్రైం: స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన పోలీస్ పీజీఆర్‌ఎస్ రద్దు అయ్యింది. దీనిని ఎన్నికల కోడ్ కారణంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఓటరు నమోదు
వేగవంతం చేయండి
అమలాపురం రూరల్: వచ్చే నెల 6లోపు ఉపాధ్యాయులంతా ఫారం–19 ద్వారా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు కావాలని డీఆర్‌ఓ సుబ్బారావు సూచించారు. ఆదివారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ మహబూబ్ బాషా, డీఆర్వో సుబ్బారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎన్ మునేశ్వరరావు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పోతంశెట్టి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.


