ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్‌

Oct 26 2026 12:10 AM | Updated on Oct 26 2026 12:10 AM

తుని 14వ వార్డు గరువువీధిలో ప్రచారం చేస్తున్న శంకర్‌ మల్లిక్‌

తుని 16వ వార్డు సమితి ఆఫీసు వీధిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా

తుని: స్థానిక మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వైఎస్సార్‌ సీపీ తరఫున మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, తనయుడు శంకర్‌ మల్లిక్‌లు ప్రచార బాధ్యతలను ముమ్మరం చేశారు. ఆదివారం తుని 16వ వార్డులో అభ్యర్థి కనిగిరి వెంకటరమణతో కలిసి రాజా ఎన్నికల ప్రచారం చేశారు. మార్కెట్‌ యార్డు లక్ష్మీగణపతి ఆలయంలో పూజలు చేసి సమితి ఆఫీస్‌ వీధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. యువనేత దాడిశెట్టి శంకర్‌ మల్లిక్‌ 14వ వార్డులో చైర్‌పర్సన్‌ అభ్యర్ధి పిట్ల రామతులసి, కౌన్సిలర్‌ అభ్యర్థి గొల్లపూడి శివానితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఫీడర్‌ రోడ్డు అష్టలక్ష్మీ గణపతి ఆలయంలో పూజలు చేసి, గరువువీధిలో ఇంటింటా ప్రచారం చేశారు. వైఎస్సార్‌ సీపీతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ రెండు ఓట్లను ఫ్యాన్‌ గుర్తుపై వేయాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ అభ్యర్థులు ఉత్సాహంగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు అన్నవరం శ్రీను, మున్సిపల్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి రేలంగి రమణాగౌడ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏలేశ్వరం 25వ వార్డులో ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఆశాలత

ఏలేశ్వరం: స్థానిక మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని ఆ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి బదిరెడ్డి ఆశాలత కోరారు. స్థానిక 25వ వార్డులో కౌన్సిలర్‌ అభ్యర్థి గెద్ద శ్రీనుతో కలసి ఆదివారం ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశాలత మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీకి పట్టంకడితే పట్టణాభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. పట్టణంలో ప్రధాన సమస్యలను పరిష్కారిస్తామన్నారు. అనంతరం పట్టణ పరిధిలోని చర్చిల్లో పార్టీ నేతలు శిడగం వెంకటేశ్వరరావు, బదిరెడ్డి గోవిందు, సామంతుల సూర్యకుమార్‌, సుంకర రాంబాబు పార్టీ శ్రేణులు ప్రార్థనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement