ఫ్యాన్‌.. ప్రచార జోరు | - | Sakshi
Sakshi News home page

ఫ్యాన్‌.. ప్రచార జోరు

Oct 27 2026 12:15 AM | Updated on Oct 27 2026 12:15 AM

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వపు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే, బియ్యం, పంచదార తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నా ఏమాత్రం పట్టించుకోని సర్కారు తీరును గడపగడపనా ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. అభ్యర్థులతో పాటు వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

– సాక్షి నెట్‌వర్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement