కొత్త పీఓలను నియమించాలని సూచన | - | Sakshi
Sakshi News home page

కొత్త పీఓలను నియమించాలని సూచన

Oct 27 2026 12:15 AM | Updated on Oct 27 2026 12:15 AM

రాజవొమ్మంగి: రాజవొమ్మంగి ఎంఈఓ కార్యాలయంలో జరుగుతున్న శిక్షణకు హాజరైన ఎనిమిది మంది ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయంగా మరో ఎనిమిది మందిని నియమించాలని రిటర్నింగ్‌ అధికారి శ్రీరామ్మూర్తికి సబ్‌ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌ సూచించారు. స్థానిక విద్యావనరుల కేంద్రంలో పీఓలు, ఏపీఓలకు జరుగుతున్న శిక్షణ తరగతులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చి, స్థానిక ఏకలవ్య పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు తమకు తెలుగు భాష రాదని, ఎన్నికల విధుల నుంచి తప్పించాలని సబ్‌ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో, ఓటు వేసేందుకు వచ్చే గిరిజనులకు భాష విషయంలో ఎటువంటి ఇబ్బందీ కలగకూడదనే ఉద్దేశంతో వీరి స్థానంలో వేరే వారిని నియమించాలని ఆయన ఆదేశించారు. నవంబరు 3వ తేదీన జరిగే పోలింగ్‌కు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement