కోనలో టీడీపీకి ఎదురుదెబ్బ | - | Sakshi
Sakshi News home page

కోనలో టీడీపీకి ఎదురుదెబ్బ

Oct 27 2026 12:15 AM | Updated on Oct 27 2026 12:15 AM

● టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరికలు

● పార్టీలోకి స్వాగతించిన

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా

తుని: టీడీపీకి కంచుకోటగా ఉన్న కోన ప్రాంతానికి చెందిన మత్స్యకారులు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆ పార్టీకి కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టారు. తొండంగి మండలం యర్రయ్యపేట, కొత్తపేట గ్రామాలకు చెందిన 200 కుటుంబాల వారు సోమవారం వైఎస్సార్‌ సీపీకి జైకొట్టారు. తుని మండలం ఎస్‌.అన్నవరంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో నాయకులు చొక్కా హరిబాబు, మడదా హేమంత్‌, మడదా చంద్రశేఖర్‌, చొక్కా కొదండ ఆధ్వర్యాన వీరు ఆ పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కండువాలు కప్పి, పార్టీలోకి స్వాగతం పలికారు. మాజీ ఎంపీటీసీ యజ్జల నాగేశ్వరరావు, యజ్జల అప్పలరాజు, యజ్జల సింహాద్రి, సూరాడ చంటి, కంబాల సత్యనారాయణ, గోపి, వంకా నాగేశ్వరరావుతో పాటు పలువురు టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించిందని అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, అందుకే వైఎస్సార్‌ సీపీలో చేరామని చెప్పారు. రాజా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు, బియ్యం ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఇదే చంద్రబాబునాయుడు బాదుడే బాదుడు అన్నారని, ఇప్పుడు ప్రజల నడ్డి విరిచేలా వీర బాదుడు బాదుతున్నారని విమర్శించారు. కూటమి పాలనలో రాష్ట్రం పరిస్థితి శ్రీలంక కంటే అధ్వానంగా మారిందని ధ్వజమెత్తారు. కూటమి పాలనపై ప్రజల్లో విరక్తి వచ్చిందని, స్థానిక ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారులు చేరడంతో పార్టీ బలం మరింత పెరిగిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement