స్థానిక ఎన్నికల్లో కూటమి నేతల కుట్రలు | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో కూటమి నేతల కుట్రలు

Oct 26 2026 12:16 AM | Updated on Oct 26 2026 12:16 AM

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు బెదిరింపులు?

జగ్గంపేట: మండలంలో కూటమి నేతలు వారి పార్టీల అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకునేందుకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను బెదిరించి, నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు, జెడ్పీటీసీ అభ్యర్థి రావుల గణేష్‌రాజా ఆరోపించారు. జగ్గంపేట మండలం జె.కొత్తూరులో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడం వెనుక కూటమి నేతలు కుట్ర ఉందని ఆరోపించారు. ఆ గ్రామం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులుగా నిడమర్తి వేణి, జ్యోతి మువ్వల (డమ్మి) నామినేషన్లు దాఖలు చేశారన్నారు. వారిని కూటమి నేతలు బెదిరించి, భయపెట్టి నామినేషన్లు ఆదివారం ఉపసంహరించుకునేలా చేశారన్నారు. మండలంలో మరికొన్ని చోట్ల కూడా వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు ఇలాంటి ఒత్తిడే వస్తోందన్నారు. కాగా..జె.కొత్తూరులో ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌ సీపీ నుంచి నిడమర్తి వేణి, జ్యోతి మువ్వల (డమ్మి), టీడీపీ నుంచి సైనం రామలక్ష్మి, సైనం మరియమ్మ (డమ్మి), ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా వల్లూరి పార్వతి నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ఆదివారం వైఎస్సార్‌ సీపీ 2, టీడీపీ1, ఇండిపెండెంట్‌ 1 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీనితో టీడీపీ అభ్యర్థి రామలక్ష్మి నామినేషన్‌ ఒక్కటే మిగిలింది. దీనితో ఆమె ఏకగ్రీవమైనట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. దీన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement