అంతర్‌ జిల్లాల దొంగల ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లాల దొంగల ముఠా అరెస్టు

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

నందివాడ: కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురంలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దీంతో పాటు మరో రెండు దొంగతనం కేసుల్లో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను బుధవారం అరెస్టు చేశారు. ఎస్సై సుబ్రహ్మణ్యం కథనం ప్రకారం.. జనార్దనపురానికి చెందిన మేకల ఏడుకొండలు ఇంటి తాళాలను ఇటీవల ఆగంతకులు పగులగొట్టి, లోపలకు చొరబడి, బంగారు వస్తువులు, రూ.5 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై నందివాడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. గుడివాడ రూరల్‌ సీఐ ఎస్‌ఎల్‌ఆర్‌ సోమేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీమ్‌ ఎస్సై ఆర్‌.త్రివర్ణ బృందం అందించిన శాసీ్త్రయ ఆధారాలతో నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం కాకినాడ జిల్లా సామర్లకోటలోని పెన్షన్‌ లైన్‌, స్టీల్‌ కంపెనీ రోడ్డులో ఉన్న చిన్న దుర్గమ్మ ఆలయం వద్ద ప్రధాన నిందితుడు చుక్కపల్లి బాబీ అలియాస్‌ ప్రవీణ్‌ కుమార్‌, అతడికి సహకరించిన పెద్దాడ హరికృష్ణ అలియాస్‌ పండు, మసకపల్లి విజయదుర్గలను పోలీసులు అరెస్టు చేశారు. నందివాడలో నమోదైన రెండు కేసులతో పాటు వీరవల్లి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మరో రెండు కేసుల్లో చుక్కపల్లి బాబీ, పెద్దాడ హరికృష్ణ, మసకపల్లి విజయదుర్గకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. వారి నుంచి 16 గ్రాముల బంగారం, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సామర్లకోటలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ వద్ద తనఖా పెట్టిన మరో 26 గ్రాముల బంగారం స్వాధీనానికి చర్యలు చేపట్టారు. ముగ్గురు నిందితులను గుడివాడ కోర్టులో హాజరు పరచగా వారికి న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్‌ విధించారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఎస్సై సుబ్రహ్మణ్యంతో పాటు ఇతర సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

జనార్దనపురం చోరీ కేసును

ఛేదించిన పోలీసులు

16 గ్రాముల బంగారం,

రూ.20 వేల నగదు స్వాధీనం

మరో 26 గ్రాముల బంగారం

రికవరీకి చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement