అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు ఆపాలి | - | Sakshi
Sakshi News home page

అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు ఆపాలి

Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): నగరంలో నిరుద్యోగులు, ప్రజాసంఘాల నాయకులపై అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలను వెంటనే ఆపాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలకు నిరసనగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యాన స్థానిక సుందరయ్య భవన్‌లో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ, కాకినాడలో ప్రభుత్వ, పోలీసు నిరంకుశ చర్యలను తీవ్రంగా ఖండించారు. తమ భవిష్యత్తు కోసం పోలీసు నిరుద్యోగ అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేసి, ప్రభుత్వానికి విన్నపాలు చేయడం నేరమా అని ప్రశ్నించారు. ఉద్యమాలు చేస్తున్న వారికి ప్రజాసంఘాలు అండగా నిలవడం దేశ ద్రోహమా అని నిలదీశారు. రెండు వారాలుగా కాకినాడలో పోలీసులు అనుసరిస్తున్న నిర్బంధ చర్యలు రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి సర్పవరం సీఐ వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, అప్పటి వరకూ ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ అభ్యర్థులను బెదిరించడం, బైండోవర్‌ కేసులు పెట్టడం మానుకోవాలన్నారు. కాకినాడ నగరంలో గంజాయి, మత్తు పదార్థాల బారిన పడి యువత భవిష్యత్తు నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క నగరంలో హత్యలు పెరుగుతూ శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో శాంతిభద్రతల పరిరక్షణకు సమయం కేటాయించాల్సిన పోలీసులు, ప్రభుత్వానికి తమ గోడు వినిపిస్తున్న నిరుద్యోగులు, ప్రజాసంఘాలపై ఉక్కుపాదం మోపడం సమంజసం కాదని అన్నారు. దీనిపై అఖిలపక్షం తరఫున ఎస్పీకి గురువారం వినతిపత్రం సమర్పించాలని, ఈ నెల 28న కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసి, వినతిపత్రం అందజేయాలని తీర్మానించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా సీనియర్‌ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు కృష్ణమోహన్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం నాయకుడు వి.రాజుబాబు, పౌర సంక్షేమ సంఘం నాయకుడు దూసర్లపూడి రమణరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాస్‌, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.రాజశేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లోవరాజు తదితరులు మాట్లాడారు.

·˘ °Æý‡$§øÅVýS$Ë$, {ç³gê çÜ…çœ*ÌS ¯éĶæ$MýS$ÌSOò³ çÜÆ>PÆý‡$ ¡Æý‡$ çÜÇ M>§ýl$

·˘ 28¯]l MýSÌñæMýStÆó‡sŒæ Ð]l§ýlª «§ýlÆ>²

·˘ Æú…yŠæ sôæº$ÌŒæ çÜÐ]l*ÐólÔèæ…ÌZ

అఖిలపక్ష నేతల పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement