డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టులా? | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టులా?

Aug 14 2026 7:38 AM | Updated on Aug 14 2026 7:38 AM

ప్రత్తిపాడు రూరల్‌: డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు మండిపడ్డారు. మండలంలోని ధర్మవరంలో గురువారం ఆయన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారని, కేవలం 16 వేల ఉద్యోగాల భర్తీకి చేపట్టిన డీఎస్సీలోనూ భారీగా అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. అందుకే ఇది దగా డీఎస్సీ అని ఎద్దేవా చేశారు. ఈ దగాపై శాంతియుతంగా నిరసనలు, నిరాహార దీక్షలు చేస్తుంటే పార్టీ శ్రేణులను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌ సీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ

రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement